తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించనున్న గ్రూప్-2, 3 పరీక్షల వాయిదాకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎంపీ మల్లు రవి వెల్లడించారు.
ఈ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తేదీలను ప్రకటిస్తుందని ఎంపీ తెలిపారు. అలాగే గ్రూప్-2 పోస్టుల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. అలాగే త్వరలోనే ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. 1,388 గ్రూప్-3 ఉద్యోగాలకు రాత పరీక్షలు ఎప్పుడు నిర్వహించనున్నారో టీఎస్పీఎస్సీ ఇంకా క్లారీటీ ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం అయితే గ్రూప్-3 రాతపరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది.