రెగ్యులర్ వరి పంటలతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించాలనుకుంటే నల్ల బియ్యం పంటను ఎంచుకోవచ్చు. నల్ల బియ్యం ధర బాస్మతి కంటే చాలా ఎక్కువ. రైతు సోదరులు ఒక హెక్టారులో నల్ల వరి సాగు చేస్తే లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం నల్లబియ్యానికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది.
జూన్ మొదటి వారంలో రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. తొలకరి జలులు పడగానే.. రైతులు వరి సాగులో కోసం రెడీ అవుతారు. అయితే, చాలా రాష్ట్రాల్లో రైతులు ఇప్పటికే వరి నాట్లు వేయడానికి పొలాలను సిద్ధం చేయడం ప్రారంభించారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లోనూ రైతుల కోసం వివిధ రకాల వరి వంగడాల నర్సరీలు సిద్ధం చేస్తున్నారు. అయితే రెగ్యులర్ వరి పంటలతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించాలనుకుంటే నల్ల బియ్యం పంటను ఎంచుకోవచ్చు. నల్ల బియ్యం ధర బాస్మతి కంటే చాలా ఎక్కువ. రైతు సోదరులు ఒక హెక్టారులో నల్ల వరి సాగు చేస్తే లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం నల్లబియ్యానికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది.
బ్లాక్ రైస్ ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్. ఇందులో యాంటీ క్యాన్సర్ ఏజెంట్లు అధికంగా ఉంటాయి. అంతే కాదు బ్లాక్ రైస్‌లో ఐరన్, ఫైబర్ , ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో బ్లాక్ రైస్ ను తినే ఆహారంలో చేర్చుకుంటే.. ఆరోగ్యంగా ఉంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. క్రమంగా దేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో నల్ల వరిని సాగు చేస్తున్నారు. విశేషమేమిటంటే నల్ల బియ్యం ఉడికిన తర్వాత దాని రంగు మారుతుంది. అందుకే దీనిని బ్లూ రైస్ అని కూడా అంటారు.
నల్ల బియ్యం పొడవుగా ఎందుకు ఉంటాయంటే..
నల్ల బియ్యం సాగు మొదట చైనాలో ప్రారంభమైంది. ఆ తర్వాత భారత్‌కు వచ్చింది. దీని సాగు భారతదేశంలో మొదటగా మణిపూర్ , అస్సాంలో ప్రారంభమైంది. ఈ నల్ల వరి సాగు కూడా సాధారణ వరి లాగే చేయాల్సి ఉంటుంది. నల్ల వరి పంట 100 నుండి 110 రోజులలో పంట చేతికి వస్తుంది. ఈ నల్ల వరి మొక్క పొడవు సాధారణ వరితో సమానంగా ఉంటుంది. అయితే దీని కంకులు గింజలు పొడవుగా ఉంటాయి. నల్ల బియ్యం పొడవు ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.
నల్ల వరి సాగు చేయడం వల్ల రైతులకు మేలు
రైతు సోదరులు నల్ల వరి సాగు చేపడితే బాగా సంపాదించుకోవచ్చు. సాధారణంగా కిలో బియ్యం ధర రూ.30 నుంచి మొదలవగా.. బియ్యంలో రకాన్ని బట్టి కిలో రూ.150కి చేరుకుంటుంది. అయితే నల్ల బియ్యం ధర కిలో రూ.250 నుంచి మొదలవుతుంది. దీని గరిష్ట రేటు కిలోకు రూ.500 వరకు ఉంటుంది. విశేషమేమిటంటే చాలా రాష్ట్రాల్లో దీని సాగుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నల్ల బియ్యం సాగు రైతులకు మేలు చేస్తుందని చెప్పొచ్చు.